టీడీపీ నేత అప్పల సూర్యనారాయణ మృతి పట్ల లోకేష్ సంతాపం

 

 శ్రీకాకుళం టీడీపీ సీనియర్ నేత గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియశారు. తెలుగుదేశం పార్టీకి వారు లేని లోటు తీరనిదని. ముక్కుసూటి, నిజాయితీకి మారుపేరైన గుండ అప్పల సూర్యనారాయణ గారు నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి. వారి సేవలు చిరస్మరణీయం. గుండ అప్పల సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాని లోకేష్ పేర్కొన్నారు. 

అప్పల సూర్యనారాయణ  ఇంట్లో కాలు జారి కిందపడటంతో ఆయన తలకు బలమైన గాయం అయింది. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతి చెందారు. నాలుగు సార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా సూర్యనారాయణ సేవలు అందించారు. టీడీపీ నుంచి 1985 నుంచి 2004 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో మంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన భార్య గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu