జగన్ పార్టీలోకి అమర్ నాధ్ రెడ్డి
posted on Dec 5, 2012 4:54PM

చిత్తూరు జిల్లా పలమనేరు ఎంఎల్ఎ, తెలుగు దేశం పార్టీ నేత అమర్ నాధ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన జగన్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నేతలు వై వి సుబ్బా రెడ్డి, రోజాలు కూడా ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సభకు ఆ నియోజక వర్గానికి చెందిన అమర్ నాధ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాలు భరించలేకే తాను జగన్ పార్టీలో చేరుతున్నానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు రెడ్డెమ్మ తో సహా, ఇతర నాయకులు కూడా ఈ సందర్భంగా జగన్ పార్టీలో చేరారు. అమర్ నాధ్ రెడ్డి ఇటీవల జైలులో జగన్ ను కలవడంతో, చంద్ర బాబు నాయుడు ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.