యజమానిని కాల్చిన పెంపుడు కుక్క
posted on Mar 1, 2013 3:09PM

పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు. కుక్కే తన యజమానిపై కాల్పులు జరిపిన సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో చోటు చేసుకుంది. ప్లోరిడాకు చెందిన జార్జ్ డెలి లానియర్...తన దగ్గరున్న బెరెట్టా 9ఎంఎం ఆటోమేటిక్ తుపాకీని క్లీన్ చేసి నేలమీదే పెట్టి బయటకు వెళ్ళిపోయాడు.
అతను బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి, కారు ఆపి దిగిన వెంటనే ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఏం జరిగింది! అని చూసుకొనే సరికి తన కాలులో నుంచి పొగ రావడం గమనించాడు. లైట్ గా రక్తం కూడా కారుతుంది. తీరా చూసుకొనే సరికి తన పెంపుడు కుక్క తాను క్లీన్ చేసినా గన్ పై నిలుచోని వుంది. యజమాని ఇంటికి రావడాన్ని గమనించిన కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గన్ ట్రిగ్గర్ పైన కాలు పెట్టడంతో అది కాస్త పేలి అతనికే తగిలింది. అయితే తన నిర్లక్ష్యానికి తగిన శాస్తి జరిగిందని ఆయన బాధపడ్డాడు.