యువరాణి రహస్యాలు బయట పెట్టిన నర్స్ మృతి
posted on Dec 8, 2012 12:27PM
.jpg)
బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ రహస్యాలు బయటి ప్రపంచానికి చెప్పిన భారత సంతతికి చెందిన నర్సు జసింటా సల్దాన్హా (46) అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. ఆమె మృత దేహం కింగ్ ఎడ్వర్డ్స్-7 ఆసుపత్రి సమీపంలో పడి ఉంది.
కేట్ మిడిల్టన్ వేవిళ్ళతో కేట్ కింగ్ ఎడ్వర్డ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సమయంలో ఆ ఆసుపత్రికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తమను తము ఎలిజాబెత్ రాణి, ప్రిన్స్ చార్లెస్ గా పరిచయం చేసుకున్న ఇద్దరు ఆస్ట్రేలియన్ డిజె లు మెల్ గ్రేయిగ్, మైకేల్ క్రిస్టియన్ యువరాణి ఆరోగ్య వివరాలు కావాలని కోరారు. అయితే, వారి ఆకతాయితనాన్ని గుర్తించని జసింటా వారికి యువరాణి ఆరోగ్యానికి సంభందించిన అన్ని వివరాలను అందించింది.
ఈ తరుణంలో జరిగిన ఆమె మృతి అనుమానాస్పదంగా మారింది. జసింటా ఆత్మహత్య చేసుకొందని భావిస్తున్నారు. బ్రిటన్ మీడియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఆమె అద్బుతమైన నర్సు అని, ఆసుపత్రిలో ఆమెకు మంచి పేరు ఉందని ఆసుపత్రి ఉద్యోగులు ఆమె మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. ఫోన్ కాల్ విషయంలో ఆసుపత్రి ఉద్యోగులంతా ఆమెకు అండగా నిలిచామని వారు అన్నారు.