కాంగ్రేసు గాలానికి చిక్కిన తెలంగాణా యంపీలు

 

 

ఒకటా! రెండా! వందసంవత్సరాలుగా కష్టపడి నేర్చిన విద్య అది. అందుకే కాంగ్రేసు అంత సులువుగా మన తెలంగాణా యంపీలకి గాలంవేసి పట్టేసి తనదారికి తెచ్చుకోగలిగింది. ఇప్పుడే అందిన వార్త ఏమిటంటే, ఈ నెల 29వ తేదిన కాంగ్రేసు ‘అఖిల పక్ష సమావేశం’ నిర్వహిస్తామని ఒట్టేసి చ్చెపడంతో, విజయం సాదిన్చేసామంటూ రెండువేళ్ళు చూపించుతూ యఫ్ డి ఐ బిల్లు పై కాంగ్రేసుకి అనుకూలంగా ఓటేసేందుకు సభలోకి ఉరికేరు మన తెలంగాణా యంపీలు అందరూ. ఇంతకీ విజయం సాదించింది వాళ్ళా లేక వాళ్ళని బుట్టలో వేసుకొన్న కాంగ్రెస్ అధిష్టనమా? వాళ్ళే చెప్పాలి మరి.

 

‘అఖిల పక్ష సమావేశం’ అనే ఒక ఐడియా మొదటినుండి తన బుర్రలో ఉంచుకొనే, కాంగ్రేసు అంట దైర్యంగా ఉంది. లేక పొతే అప్పటికి అప్పుడు ఇటువంటి వాళ్ళని దారికి తెచ్చుకోవాలంటే సాద్యమా? అసలు, ఆ ముక్క కూడా అనకుండానే వాళ్ళు దారికి వస్తారేమోనని , నిన్న షిండే కమలనాథుల ద్వారా ప్రయత్నించింది కాంగ్రేసు. అప్పుడు వాళ్ళు లొంగల పోయేసరికి తన అమ్ముల పోదిలోంచి ఒక తుప్పు పట్టిన బాణం (‘అఖిల పక్ష సమావేశం’-ఐడియా) బయటికి తీసి వాల్లమీదకి వదిలింది అంతే అందరూ పడిపోయేరు. మరి ఇటువంటి మరెన్ని బాణాలు కాంగ్రేసు అమ్ముల పొదిలో ఉన్నాయో ఎవరికీ తెలుసు?

 

ఒక దెబ్బకి రెండు పిట్టలు కొట్టే అవకాశం చేతిలోంచి జారి పోతుంటే ఏమిచేయ లేక కే.సి.ఆర్. కూడా వాళ్ళని కసితీర తిట్టుకొంటూ కాంగ్రేసుకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు వాళ్ళ వెనుకే అతనూ లోపలి పోయేడని మరో తాజా వార్త. ఇక, రేపటి నుండి వాళ్ళని కే.సి.ఆర్. అతని అనుచరులు ఎలా యేకిపారేస్తారో మరి తలుచుకొంటేనే వాళ్ళ ఒళ్ళు గగుర్పోడవకమానదు. తెలంగాణా తిరిగి రావడం కన్నా, అక్కడే డిల్లీలోనే మొహం దాచుకొంటే మేలనుకొనే అవకాశము కూడా వాళ్ళకి ఉంది. అప్పుడే బి.జే.పి, ‘అఖిల పక్ష సమావేశం’ పేరు చెప్పి కాంగ్రేసు కొత్త నాటకాం మొదలు పెట్టిందని దుయ్యబట్టడం మొదలు పెట్టేసింది.

 

కాంగ్రేసు ‘అఖిలపక్ష సమావేశం ఐడియా’ వినగానే మొదట తెరాస నేత ఈటెల రాజేందర్ కూడా ఇదే మాట చెపుతూ, తెలంగాణా కాంగ్రేసు యంపీలని బుట్టలో పడవద్దని అయన మరీ మరీ హెచ్చరించినా పాపం ఫలితం లేకపోయింది. అయినా, సోనియమ్మా ఆగ్రహానికి గురయ్యే దైర్యం కాంగ్రేసులో ఎవరికి ఉంది? ఆమెను కాదని పార్టీ వీడితే, మన తెలంగాణా యంపీలు కెసిఆర్ వెనుక తిరుగగలరా? అందుకే, ముందు కాస్త బెట్టు చేసి తెలంగాణా ప్రజల ముందు హీరోయిజం ప్రదర్శించినా, తరువాత కాంగ్రేసు దారిలోనే నడిచేరు వాళందరూ. అలాగని, వాళ్ళంతా హైదరాబాదు తిరిగి వచ్చేక ప్రెస్సు మీట్స్ పెట్టి డాంబికాలు పలుకకమానారు, తెరాస, టి-జే.యే.సి. మరియు బిజెపిలూ కలిసి కట్టుగా వాళ్ళ వెంట పడక మానవు. కొస మెరుపు ఏమిటంటే, ప్రస్తుతం పార్లమెంటులోనే ఉన్నలగడపాటి హడావుడిగా బయటకి వచ్చి మీడియాని పిలిచి ‘ఎవరెన్ని సమావేశాలు పెట్టుకొన్నపటికీ ఇప్పుడప్పుడే తెలంగాణా మాత్రం ఖచ్చితంగా రాదు’ అని గబ గబా చెప్పేసి మళ్లీ వచ్చినంత వేగంగా సభలోకి హడావుడిగా వెళ్లి పోయాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu