టిడిపి సీనియర్లఫై నన్నపనేని అసంతృప్తి
posted on Jan 1, 2013 10:18AM

గత నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా అనుకూల వైఖరి తీసుకొని ఆ ప్రాంతంలో ఎలాగో గట్టేక్కామని తెలుగు దేశం పార్టీ భావిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ప్రాంత నేతల నుండి పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పార్టీ తీసుకొన్న వైఖరిఫై మొన్న టిడిపి పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అసంతృప్తి గళం విప్పితే, నిన్న ఆ పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఈ కోవలోకి చేరారు. తాను సమైఖ్య వాదినని ప్రకటించారు. తమ పార్టీ అధిష్టానం నుండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని, అందువల్ల ఈ విషయంలో ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. కొంత మంది పార్టీ నాయకులు పార్టీలో ఏమి చేసినా జరిగిపోతుందని ఆమె విమర్శలు చేశారు.
చంద్రబాబు చుట్టూ ఉండే వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని ఆమె సూచించారు. తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడిన వేణుగోపాల్ రెడ్డి ని తాను అభినందిస్తున్నానని ఆమె అన్నారు. తాను సుదీర్ఘ కాలం పార్టీ కోసం కష్టపడటం వల్లే తనకు శాసన మండలి సభ్యత్వం ఇచ్చారని ఆమె అన్నారు.