అమెరికాలో అతి తెలివి ఇండియన్!

మహామహా మేధావులంతా మన ఇండియాలోనే పుడుతూ వుంటారు. ఆర్యన్ ఆనంద్ అనే కుర్ర మేధావి కూడా మన ఇండియాలోనే పుట్టాడు. చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చేరాడు. ఆ యూనివర్సిటీలో తండ్రి లేని వాళ్ళకి స్కాలప్‌షిప్ ఇస్తారని తెలుసుకున్నాడు. అంతే, మనోడి బుర్రలో పురుగు పుట్టింది. మా నాన్న కూడా నా చిన్నప్పుడే చనిపోయాడు.. నాకూ స్కాలర్‌షిప్ ఇవ్వండి అని యూనివర్సిటీ వాళ్ళని అడిగాడు. మీ నాన్న చచ్చిపోయాడని మాకేంటీ గ్యారెంటీ అని యూనివర్సిటీవాళ్ళు అడిగారు.  మా డాడీ డెత్ సర్టిఫికెట్ వుందిసార్ అని మనోడు సర్టిఫికెట్ చూపించాడు. దాంతో యూనివర్సిటీ వాళ్ళు కరిగిపోయి మనోడికి స్కాలర్ షిప్ ఇచ్చారు. అక్కడితో ఆగితే మనోడు ఇండియావాడు ఎందుకవుతాడు? నేను ఇంత తెలివైనోడిని అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నిజానికి మా నాన్న చచ్చిపోలేదు.. నేను తప్పుడు డెత్ సర్టిఫికెట్ ఇచ్చి స్కాలర్‌షిప్ కొట్టేశా. నేను టెన్త్ క్లాస్ కూడా పాస్ అవలేదు.. డూప్లికేట్ సర్టిఫికెట్‌తోనే అమెరికా యూనివర్సిటీలో సీటు సంపాదించా.. నాలాగా తెలివిగా వుంటే జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అని పోస్టు పెట్టాడు. ఇంకేముందీ.. ఈ పోస్టు యూనివర్సిటీ వాళ్ళ దృష్టికి వెళ్ళింది. అంతే, మనోడిని అరెస్టు చేసి లోపలేశారు. మామూలుగా అయితే అమెరికా చట్టాల ప్రకారం ఈ తిక్కలోడికి ఇరవయ్యేళ్ళు శిక్ష పడే ఛాన్సుండేదంట.. కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు అంత శిక్ష ఎందుకులే అని చెప్పి, యూనివర్సిటీ నుంచి డిబార్ చేసి, ఈ తెలివితక్కువోడిని ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారంట. ఓరి దరిద్రుడా.. నీ బుర్రతక్కువతనంతో ఇండియా పరువు తీశావు కదరా...