మోడీపై సొంత పార్టీ నేత కామెంట్లు...


పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీ నేతలే ఇప్పటివరకూ మోడీపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు తన సొంత పార్టీ నేతనే మోడీ నిర్ణయంపై విమర్శలు గుప్పించి పార్టీ నేతలకు  షాకిచ్చాడు. నటుడు, బీజేపీ పార్టీ అసమ్మతి ఎంపీ శత్రుఘ్నసిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మొబైల్‌ యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చారని, కేవలం 2 శాతం మంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారన్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన శత్రుఘ్నసిన్హా... భ్రమల్లో బతకొద్దని.. ‘ పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోండి. కట్టుకథలు, స్వప్రయోజనాల కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉండాల’ని శత్రుఘ్నసిన్హా అన్నారు. మరి దీనిపై పార్టీ నేతలు ఏలా స్పందిస్తారో చూడాలి.

 

ఇక మరోవైపు ప్రతిపక్షాలు ఈ సర్వేపై విమర్శలు చేసిన సంగతి విదితమే. మోదీ సర్కారు తమకు అనుకూలంగా ఈ సర్వే చేయించుకుందని ఆరోపించాయి.