పార్లమెంట్లో పెళ్లి పత్రికలతో యువరాజ్ సింగ్..
posted on Nov 24, 2016 2:20PM
టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్, హాలీవుడ్ నటి హజల్కీచ్ల పెళ్లి త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఈ నెల 30వ తేదీన చండీగఢ్ లో గురుద్వారా సాంప్రదాయం ప్రకారం.. వచ్చే నెల 2వ తేదీన గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం మరో వివాహ వేడుక జరగనుంది. ఈనేపథ్యంలో యువరాజ్ సింగ్ ఇప్పటికే తన పెళ్లి పత్రికలను పంచే పనిలో పడ్డాడు. దీనిలో భాగంగానే ఈ రోజు పెళ్లి పత్రికలతో పార్లమెంట్ కు చేరకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన పెళ్లి పత్రికను అందించడానికి ఈ రోజు తల్లి షబ్నం సింగ్తో కలిసి పార్లమెంట్కు వెళ్లాడు. మోదీని కలిసిన అనంతరం ఆయన పలువురు కేంద్ర మంత్రులని కూడా తన వివాహానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.