శ్రీకాళ హస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ శ్రీకాళహస్తి దేవాలయంలో హైడ్రామా క్రియేట్ చేశారు. దేవాలయంలో ప్రవేశించే సమయంలో అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం వివస్త్రను అనుమతించబోమని చెప్పడంతో గొడవ ప్రారంభమైంది. అఘోరీలు వివస్త్రగానే దేవాలయంలో ప్రవేశిస్తారని అక్కడున్న సిబ్బందికి తెలిపారు. అయినా వినకపోవడంతో అక్కడ్నుంచి తన కారు వద్దకు వెళ్లి   క్యాన్లో ఉన్న పెట్రోల్ వంటిపై పోసుకున్నారు. కారుపై కూడా పెట్రోల్ చల్లడంతో హైటెన్షన్ నెలకొంది. సిబ్బంది  అఘోరీపై నీళ్లు గుమ్మరించి వస్త్రాలు తొడిగారు. పెద్ద పెద్దగా అఘోరీ కేకలు వేయడంతో దేవాలయానికి సంబంధించిన అంబులెన్స్ లో అఘోరీని కూర్చొబెట్టారు. అక్కడ్నుంచి  ఎపి బార్డర్ తరలించారు. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తికి తమిళనాడు దగ్గర కావడంతో అంబులెన్స్ చెన్నయ్  వైపు వెళ్లినట్లు సమాచారం. మంచిర్యాల నుంచి తెలంగాణ బార్డర్ దాటించిన పోలీసులు తాజాగా ఎపి పోలీసులు తమిళనాడు పంపించడంతో తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హైడ్రామా ముగిసినట్టయ్యింది.