బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా ఏం చేశారో!?



హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆదివారం నాడు తన పుట్టినరోజును వైభవంగా జరుపుకున్నారు. క్రీడా రంగానికి, సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సానియా మీర్జాకి పోటీలు పడి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది ప్రముఖులు అయితే సానియాకి పుట్టినరోజు గిఫ్టులు పంపి తమ అభిమానం చాటుకున్నారు. సానియా వాళ్ళందరికీ ట్విట్లర్లో తన కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన రాజీవ్ ఖేల్ రత్న ఫొటోని చూపిస్తూ ఫొటోని కూడా ట్విట్లర్లో పోస్టు చేశారు. సానియా మీర్జా మన దేశం నుంచి అంతర్జాతీయ క్రీడాకారిణిగా విజయాలు సాధించడం అభినందించదగ్గ విషయమే. ఆమెకు చాలామంది అభిమానంతో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కూడా మంచి విషయమే... క్రీడాకారిణిగా సానియా ఓకే... మరి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె ఏం చేశారన్న విషయాన్ని ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు మనసు బరువెక్కక మానదు.

సానియా మీర్జా ప్రతిభని గౌరవిస్తూ ఇచ్చారో, ముస్లిం ఓటర్లని మాయ చేసి, జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవాలని ఇచ్చారోగానీ అధికారాన్ని చేపట్టగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గౌరవాన్ని ఇచ్చి, రెండు విడతలుగా రెండు కోట్ల రూపాయలు కూడా సమర్పించారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ గానీ, సానియా గానీ ఎంతమాత్రం పట్టించుకోలేదు. అయితే  సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హోదా తీసుకుని, తెలంగాణ ప్రజల కష్టార్జితం రెండు కోట్లు పుచ్చుకుని దాదాపు రెండేళ్ళు అవబోతోంది. మరి ఈ కాలంలో సానియా టెన్నిస్ ఆడటం మినహా తెలంగాణ కోసం ఏం చేశారనే ప్రశ్నకు సమాధానం దొరకదు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu