ఫామ్‌లోకొచ్చిన మాస్టర్ బ్లాస్టర్
posted on Nov 3, 2012 10:30AM

సచిన్ రంగప్రవేశంతో రంజీ సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. శుక్రవారం ఆరంభమైన రంజీ సీజన్‌లో సెంచరీల మోతమోగగా.. కొంతకాలంగా పరుగుల వేటలో విఫలమవుతున్న మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ కూడా శతక్కొట్టి తన దాహం తీరలేదని నిరూపించాడు. గ్రూప్-ఎలో రైల్వేస్‌తో శుక్రవారమిక్కడ ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో సచిన్ 136 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137, అజింక్యా రహానె 207 బంతుల్లో 13 ఫోర్లతో 105 నాటౌట్, సెంచరీలతో కదంతొక్కారు. తొలిరోజు ఆటముగిసే సమయానికి ముంబయి నాలుగు వికెట్లకు 344 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 200 పరుగులు జోడించారు. అయితే మరికొద్దిసేపట్లో ఆట ముగుస్తుందనగా అనురీత్ బౌలింగ్‌లో సచిన్ అవుటయ్యాడు.