డాక్టర్ సైనానెహ్వాల్
posted on Nov 4, 2012 11:17AM
.jpg)
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు గౌరవ డాక్టరేట్ హోదా లభించింది. లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు ఇక్కడి మంగళయతన్ యూనివర్సిటీ గౌరవ పట్టాలను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో సైనాతో పాటు బాక్సర్ మేరీకోమ్, షూటర్లు గగన్ నారంగ్, విజయ్ కుమార్, రెజ్లర్లు సుశీల్‌కుమార్, యోగేశ్వర్ దత్ ఉన్నారు. యూనివర్సిటీ స్నాతకోత్సవంలో వీరికి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఈ గౌరవ పట్టాలు ప్రదానం చేశారు. దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడపడానికి ఆటగాళ్లు కూడా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ములాయం కోరారు. 'ఆటగాళ్లకుండే చరిష్మాను ఉపయోగించుకుని వారు కూడా ప్రజాజీవితంలోకి రావాలి, ఎన్నికల్లో పోటీచేయాలి' అని ములాయం సింగ్ అన్నారు.