రెండు రోజుల పాటు వానలే వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బుధవారం (డిసెంబర్ 25) నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

బుధవారం (డిసెంబర్ 25) ఉదయం నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. దీనికి తోడు గాలులు కూడా వీస్తుండటంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఇదిలా ఉండగా మంగళవారం (డిసెంబర్ 24) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.