మాజీ ప్రధాని వాజ్ పేయికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినలో పర్యటిస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా సదైవ్ అటల్ లో ఆయనకు నివాళులర్పించి సర్వమత ప్రార్థన సభలో పాల్గొన్న చంద్రబాబు. ఈ రోజంతా హస్తినలో బిజీబిజీగా గడపనున్నారు.

ఈ మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీయే సీఎంల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామితో భేటీ అవుతారు.

ఇక సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. ఆ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో  అనంతరం కేంద్ర విత్త మంత్ర నిర్మలాసీతారామన్ తో భేటీ కానున్నారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం నిర్మాణం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు ఈ భేటీలలో చర్చించనున్నారు.