హస్తినను కమ్మేసిన పొగమంచు.. చలికి గజగజలాడుతున్న ఉత్తర భారతం

దేశ రాజధాని నగరం హస్తినను పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రతతో మొత్తం ఉత్తర భారతం గజగజలాడుతున్నది. హస్తినలో అయితే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బుధవారం ఉదయం రాజధాని నగరంలో  9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక పొగమంచు కారణంగా ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వాయు కాలుష్యం మరోసారి పీక్స్ కు చేరడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దు చేయగా, మరి కొన్నిటిని రీ షెడ్యూల్ చేశారు. అలాగే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.