ఫార్ములా ఈ రేసు కేసులో కొత్త కోణం... గ్రీన్ కో కంపెనీ.. బీఆర్ఎస్ క్విడ్ ప్రోకో!?

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతిలో క్విడ్ ప్రొకో కోణం ఉందని తాజాగా వెలుగులోనికి వచ్చింది.  ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలకంగా ఉన్న గ్రీన్ కో కంపెనీ  నుండి ఎలక్టోరల్ బ్యాండ్లు, చందాల రూపంలో బీఆర్ఎస్ కు రూ. 41 కోట్లు అందాయి. ఈ విషయాన్ని తెలంగాణ సర్కార్ బయటపెట్టింది. ఈ మొత్తాన్ని బీఆర్ఎస్ నగదు రూపంలో కాకుండా  ఎలొక్టరోల్ బాండ్లు, పార్టీకి చందాల రూపంలో  బీఆర్ఎస్ అందుకుందన్నది తెలంగాణ సర్కార్ ఆరోపణ.

అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి క్రీన్ కో ఎన్నికల బాండ్ల రూపంలో  రు. 41 కోట్లు చెల్లిం చిందని  ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.  గ్రీన్ కో దాని అనుబంధ సంస్ధలు 41 సార్లు బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్ల రూపంలో  చందాలు ఇచ్చినట్లు రేవంత్  సర్కార్ ప్రకటించింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన చర్చలు మొదలైనప్పటినుండి ఒక్కోటి కోటి రూపాయలు విలువచేసే ఎలక్టోరల్ బాండ్లు గ్రీన్ కో చెల్లించింది. 2022, ఏప్రిల్ 8వ తేదీనుండి అక్టోబర్ 10వ తేదీమధ్య గ్రీన్ కో కంపెనీ నుండి బీఆర్ఎస్ పార్టీకి బాండ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అయితే ప్రభుత్వం బయటపెట్టిన వివరాలన్నీ బూటకమే అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖండించారు. ఎన్నికల బాండ్లు తీసుకోవటంలో తప్పేముందన్నారు. ఇదే గ్రీన్ కంపెనీ నుండి కాంగ్రెస్, బీజేపీలు కూడా బాండ్ల రూపంలో విరాళాలు తీసుకున్నాయన్నారు. కేంద్రఎన్నికల కమిషన్ అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లను తీసుకోవటం తప్పు ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. మొన్నటివరకు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో అసలు అవినీతే లేదని చాలాసార్లు చెప్పారు. కేసంతా కుట్రపూరితమే అని కొట్టిపారేశారు. అలాంటిది ఇపుడు ఎలక్టోబరల్ బాండ్లు తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు గ్రీన్ కో కంపెనీ నుండి బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్లు ఎందుకు వచ్చాయన్న విషయంపై మాత్రం కేటీఆర్ నోరు మెదపడం లేదు.  ఏ కంపెనీ అయినా లాభం లేనిదే  ఏ రాజకీయ పార్టీకీ  విరాళాలు ఇవ్వదనడంలో సందేహం లేదు.  ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు విరాళాలు ఇస్తే ఏదో రాజకీయపార్టీ కాబట్టి విరాళమిచ్చిందని అనుకోవాలి. అదే అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఇచ్చిందంటే కచ్చితంగా ఏదో  ఆ కంపెనీకి ఏదో లబ్ధి చేకూరిందనే భావించాల్సి ఉంటుంది.  

అందులోనూ దఫదఫాలుగా కోట్ల రూపాయలు విరాళం రూపంలో అధికార పార్టీకి ముట్ట చెప్పిందంటూ.. ఇందుకు తెరవేనుక నుంచి ఆ కంపెనీకి ఏదో రూపంలో ఇచ్చిన విరాళాల కంటే ఎక్కువగానే లబ్ధి చూకూరిందని అనుమానించాల్సి ఉంటుంది.  అందులోను కోట్లాదిరూపాయల విరాళాలిచ్చిన కంపెనీకి అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కాంట్రాక్టులిచ్చి ఒప్పందం చేసుకున్నదీ అంటే ఆ విరాళాలు కచ్చితంగా క్రిడ్ ప్రోకోలో భాగమేనని చెప్పక తప్పదు.  

ఇపుడు ప్రభుత్వం బయటపెట్టిన ఎన్నికల బాండ్ల విరాళాల వివరాలతో  బీఆర్ఎస్-గ్రీన్ కో కంపెనీ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని రూఢీ అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల బాండ్లు తప్పేమిటి? ఎన్నికల సంఘమే అనుమ తించిందిగా అని కేటీఆర్ ఎంతగా సమర్ధించుకోవడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదని అంటున్నారు.