బుద్ధభవన్ లో హైడ్రా పోలీస్ స్టేషన్.. ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ సర్కార్
posted on Jan 8, 2025 9:48AM
హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగించేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించిన ప్రభుత్వం, ఆ దిశగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. బుద్ధ భవన్ బీ-బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. హైడ్రాకు విస్తృత అధికారాలను కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇ
ప్పుడు తాజాగా హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడంతో హైడ్రా దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. హైడ్రా పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసరుగా ఏసీపీ స్థాయి అధికారిని నియమిం చనున్నారు. హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు, పార్కులు, లేఔట్స్, ఓపెన్ప్లాట్స్, ప్లే గ్రౌండ్స్, ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తుంది. ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా మానిటర్చేస్తుంది. ఇక నుంచి భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, ఇతర కేసులకు సంబంధించి హైడ్రాకు ఫిర్యాదు చేయాలనుకునే వారు హైడ్రా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.