ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి, ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్
posted on Jan 8, 2025 10:28AM
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచాయి. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసిన తరువాత ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని అర్ధం చేసుకున్న నిందితులు విచారణ సంస్థలకు సహకరించకతప్పని పరిస్థితుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు బుధవారం ( జనవరి 8) హాజరయ్యారు. పూర్తి డాక్యుమెంట్లతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారని చెబుతున్నారు. విచారణ అనంతరం ఈడీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేస్తారు.
ఇలా ఉండగా ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బుధవారం (జనవరి 8) అయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసులో నగదు బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.