కెటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణ  కాసేపట్లో...

ఫార్ములా ఈ  కార్ రేస్ కేసులో ప్రధాన నిందితుడైన , మాజీమంత్రి  కెటీఆర్ దాఖలు చేసిన పిటిషన్  బుధవారం మధ్యాహ్నం విచారణకు రానుంది. కెటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు అనుమతించింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపే విధంగా ఎసిబికి ఆదేశాలివ్వాలని  కెటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు విచారణకు రావాలని కెటీఆర్ కు  ఎసిబి నోటీసులు జారీ చేసింది.  ఇదే కేసులో కెటీాఆర్ గతంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి భంగపడ్డారు. ఈ నేపథ్యంలోనే  ఆయన సుప్రీం  కోర్టు కెక్కే ప్రయత్నాలు చేస్తూనే తెలంగాణా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.