సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై గరికపాటి సీరియస్ 

తనపై  గత వారం  రోజులుగా మీడియాలో వస్తున్న ప్రచారంపై  ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు   ఖండించారు. ఈ ప్రచారంపై కుట్ర కోణం ఉందని ఆరోపించారు. కామేశ్వరి అనే మహిళ గరికపాటి మొదటి భార్య అంటూ సోషల్ మీడియాలో  కొన్ని  వీడియోలు వైరల్ అయ్యాయి. 40 ఏళ్ల క్రితం నాటి వివాహబంధానికి తెగదెంపులు చేసుకుని ఆమె విడాకులు తీసుకుంది. గరికపాటికి సెద్దల సమక్షంలో మరో వివాహం జరిగింది అయితే కామేశ్వరి వీడియోలవల్ల అభిమానులు కలత చెందుతుందుతున్నారు. వ్యక్తులు ,  యూ ట్యూబ్ చానెళ్లు ఎవరైనా కానీతప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయనున్నట్టు  గరికపాటి టీం హెచ్చరించింది. గరికపాటి తన ఇన్ స్టాగ్రాంలో కూడా తన టీం ఆవేదనను పోస్ట్ చేశారు.