శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్

పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి   కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజను నటుడు, పుష్ప2 హీరో అల్లు అర్జున్ మంగళవారం (జనవరి 7) ఉదయం పరామర్శించారు.

అలాగే  సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటనలో మరణించిన  రేవతి  భర్తను కూడా అల్లు అర్జున్ పరామర్శించారు. అల్లు అర్జున్ వెంట కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన వారిలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాు కూడా ఉన్నారు.  శ్రీతేజను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన క్రమంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.