రూ.4.10లక్షలు పలికిన పుంగనూరు గోవు
posted on Jul 25, 2022 12:48PM
బడి పిల్లలకి ర్యాలీ సైకిలు ఇష్టం, పెద్ద ఉద్యోగికి మారితీ కారు ఇష్టం, కోటీశ్వరుడికి బిఎండబ్ల్యూ మరీ యిష్టం. కానీ బాబా రాందేవ్ మాత్రం మూడున్నర సంవత్సరాల గోవును కొనుక్కున్నారు. అన్ని వస్తువు లూ అన్ని చోట్లా నాణ్యమైనవి లభించవు. నాణ్యమైన వస్తువుల దుకాణాలకే వెళతాం. అది కారు అయినా, చేతి కంకణం అయినా. మరి గోవు కావాలన్నపుడు మంచి జాతి గోవునే ఆశిస్తారు గదా. గోవులు ఎక్కడన్నా దొరుకుతాయి. కానీ కొన్ని ప్రత్యేక జాతులవి కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతాయి. రాందేవ్ బాబా మాత్రం పుంగనూరు జాతి గోవునే కావాలనుకున్నారు. అందుకు ఏకంగా రూ.4.10 లక్షలు పెట్టారు.
చిత్తూరుజిల్లాలో ఎక్కువగా కనిపించే పుంగనూరు జాతి ఆవును గుంటూరు జిల్లా తెనాలిలో రాందేవ్ కొన్నా రు. ఈ గోవు వయసు మూడున్నర సంవత్సరాలు, ఎత్తు కేవలం 30 అంగుళాలు. ప్రముఖ యోగా గురు రాందేవ్ ఆశ్రమం నుంచి ఆయన ప్రతినిధులను పంపారు. తెనాలిలో మంచి జాతి గోవులు ఉన్నాయని తెలిసి. తెనాలిలో కంచర్ల శివకుమార్‌ను కలిసి ఆవును కొనుగోలు చేశారు. అంతకు ముందు దానికి పశు వైద్యాధికారి నాగిరెడ్డి వద్ద పరీక్షలు చేయించారు. అనంతరం దానిని వారు తీసుకెళ్లారు. ప్రత్యేకమైన ఈ జాతి పెంపకానికి అనువుగా ఉంటుందని బాబా రాందేవ్ ఆశ్రమ ప్రతి నిధులు తెలి పారు.
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ప్రచారంలో బాబా రాందేవ్ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిం దే. ఆయన హరిద్వార్‌లో నిర్వహిస్తున్న గోశాల కూడా అంతే ప్రాచుర్యం పొందింది. దేశ విదేశాల నుంచి కూడా ఆశ్రమాన్ని సందర్శించడంలో భాగంగా గోశాలను కూడా తప్పకుండా సందర్శిస్తుంటారు. అక్కడ గోవుల సంరక్షణకు ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అనేక రకాల గోవులను అక్కడ చూడవచ్చు. దేశం లో అంతరించిపోతున్న గో జాతిని సంరక్షించడం బాబా ఆశ్రమం ప్రధాన చర్యగా స్వీకరించింది. అందు లో భాగంగానే తెనాలి లో ఉన్న గోవు సమాచారం తెలిసి ఆయన ప్రత్యేకంగా హరిద్వార్ గోశాలకు తరలిం చారు. అంతగా లభించని జాతి గోవు గనుకనే లక్షలు పోసి హరిద్వార్‌కు తరలించారన్న అభిప్రా యాలే వ్యక్తమవుతున్నాయి.