మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాతో మోడీ టాప్!
posted on Mar 29, 2025 12:35PM
.webp)
దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ నంబర్ వన్ గా నిలిచారు. ఒక ఆంగ్ల దినపత్రిక 2025 సంవత్సరానికి దేశంలో వంద మంది మోస్ట్ పవర్ పుల్స్ ఇండియన్స జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో ప్రధాని మోడీ టాప్ లో నిలిచారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తరువాత వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఉన్నది మోడీ మాత్రమే.
ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిలిచారు. ఇంకా ఈ జాబితాలో విదేశాంగ మంత్రి జైశంకర్ మూడో స్థానంలో నిలవగా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భవగవత్ నాలుగో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 9వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు 14వ స్థానంలోనూ, రేవంత్ రెడ్డి28వ స్థానంలోనూ నిలిచారు,
అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కూడా స్థానం దక్కింది. ఇంకా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కూడా మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్స్ జాబితాలో చోటు దక్కింది. ఇంకా వ్యాపార దిగ్గజాలు రిలయన్స ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఇంకా ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి స్థానం సినీ హీరో అల్లు అర్జున్ కు కూడా స్థానం దక్కింది. ఈ జాబితాలో 98వ స్థానం దక్కింది.