7 శతాబ్దాల నాటి ఇంద్రేశ్వరాలయాన్ని పునరుద్ధరించాలి
posted on Nov 5, 2024 5:22PM
పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
నాగర్ కర్నూల్ కు తాడూరుకు దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఇంద్రకల్ గ్రామ పొలాల్లో ఉన్న కాకతీయుల కాలం ఇంద్రేశ్వరాలయం శిథిలావస్థలో ఉందని కాపాడి భావి తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమనిశివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూల్ కు చెందిన ప్రముఖ సాహిత్య అభిమాని, జర్నలిస్ట్ ముచ్చర్ల దినకర్ .కవి ఎదిరేపల్లి కాషాన్నలు ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఇంద్రేశ్వరాలయాన్ని సందర్శించినట్లు తెలిపారు.
గర్భాలయం ,అర్థ మండపం, మహా మండపం తో పాటు ఉన్న ఇంద్రేశ్వరాలయం 700 సంవత్సరాల నాటి కాకతీయ ఆలయ వాస్తు శిల్పానికి అద్దం పడుతుందన్నారు. ఆలయం విలువల ద్వారా శాఖలు శివలింగం దేవతలు మిగతా మండపాలతో ఆటో నందులు చక్కటి మహిషాసురమర్ధిని శిల్పాలు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఉన్నాయని అన్నారు. చరిత్ర కు ప్రాధాన్యత గల ఈ శిల్పాలను భధ్ర పరిచి ఆలయాన్ని పునరుద్ధరించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విన్నపం చేశారు . ఆలయానికి మరమ్మ త్తులు చేసి గత వైవాన్ని సంతరించుకునేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుం వెంకటేశ్వర రెడ్డి గ్రామస్తులు కొత్తపల్లి జానయ్య ,వీ తిరుపతయ్య తోపాటు పలువురు పాల్గొన్నారు.