రాష్ట్రపతి దక్షిణ విడిది ముగింపు

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదిరోజుల దక్షిణాది పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా విడిది ముగించుకొని బుధవారం హకీంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ పదిరోజుల విడిదిలో రాష్ట్రపతి అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. తిరుమల యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించారు. రాష్ట్రపతికి వీడ్కోలు తెలుపడానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూధనాచారి, స్వామిగౌడ్ తదితర రాజకీయ నేతలు విమానాశ్రయానికి వచ్చారు.