తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత  రెండు రోజులుగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొండపై రద్దీ  ఎక్కువగా ఉంది. శుక్రవారం (డిసెంబర్ 27) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ కిలోమీటర్ల మేర సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి  సర్వ దర్శనానికి 20 గంటలకుపైగా సమయం పడుతోంది. వరుస సెలవులతో పాటుగా వారాంతం కూడా కావడంతో రానున్న రెండు రోజులలో  భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసింది.. క్యూ లైన్లలో భక్తులకు పాలు, మంచినీళ్లు అల్పాహారం అందిస్తున్నారు.