చిత్రపరిశ్రమకు అండగా ఉంటా: సినీ ప్రముఖులతో రేవంత్ రెడ్డి
posted on Dec 26, 2024 10:52AM
ఎఫ్ డిసి చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బెనిఫిట్స్ షో రద్దు చేస్తున్నట్టు, టికెట్ల పెంపు నేనున్నంతవరకు ఉండవని ప్రకటించడంతో చిత్రపరిశ్రమ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. సినీ ప్రముులతో జరిగిన భేటీ సందర్బంగా చిత్రపరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ మాఫియాతో సినీ లింకుల పట్ల ముఖ్యమంత్రి ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. టూరిజంను పెంపొందించడంలో టాలివుడ్ సహకరించాలని ముఖ్యమంత్రి కోరినట్టు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య నెలకొన్న విభేధాలు సమసిపోయినట్టయ్యింది.