పిన్నెల్లికి పోలీసు మర్యాదలు!

నెల్లూరు సెంట్రల్ జైల్లో వున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ కళ్యాణ్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. పిన్నెల్లి నుంచి అదనపు సమాచారం రాబట్టడానికి నాలుగు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా, కేవలం రెండు రోజుల పాటు మాత్రమే కస్టడీకి అనుమతించారు. ఈనెల 8, 9 తేదీలలో నెల్లూరు సెంట్రల్ జైల్లో వెబ్ కాస్టింగ్‌తో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది.