కష్టపడినప్పటికీ సంపన్నులు ఎందుకు కాలేకపోతున్నారు?
posted on Oct 4, 2024 5:27PM
జబ్జార్ భాయ్ బ్యాంకు ఉద్యోగిగా రిటైరయ్యారు. పెన్షన్ తప్పితే మరో ఆదాయ మార్గం లేకపోవడంతో నిరాశ, నిస్పృహ ఆవహించింది. నెలకు లక్ష రూపాయల జీతం రాకపోవడమే ఆయన నిస్పృహకు కారణమైంది.
ఒక రోజు మౌలానా తారసపడ్డాడు.
మౌలానా: జబ్జార్ భాయ్ మునుపటి మాదిరిగా ఉత్సాహంగా లేకపోవడాన్ని మౌలానా పసిగట్టారు. ఏమయ్యింది , జబ్బార్ భాయ్ అలా ఉన్నావు అని అడిగాడు.
జబ్బార్ భాయ్: సలాం వాలేకుం మౌలానాసాబ్. నేను 40 ఏళ్లు ఉద్యోగం చేసి రెండు ఇళ్లు , పిల్లల పెళ్లిళ్లు చేశాను. ఇటీవల రిటైరయ్యాను. పిల్లలకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. సంపాదించే నేను రిటైరయ్యాను. పెన్షన్ తప్పితే మరో మార్గం లేదు. మనవడు, మనవరాళ్లను ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివించాలంటే డబ్బు లేదు మౌలానా సాబ్
మౌలానా: నేను ఇస్లాం అమలుకు సంబంధించి వేలాది తక్రీర్ ( ప్రవచనం)లు ఇచ్చాను. వాటిని అమలు చేసే వారు కరువయ్యారు. ఏడెనిమిది ఏళ్ల క్రితం నేను ఇచ్చిన తక్రీర్ లను మనుషులు అమలు చేసే వారు. ఇప్పుడలా లేదు. డబ్బు ఎక్కువైతే చాలామంది బుర్ర చెడిపోతుంది. డబ్బున్నవాడు పేదవాడిని అవమానపరుస్తాడు. అహంకారం ఎక్కువైతే మనుషులను వేధించడం ప్రారంభిస్తారు. బేవకూఫ్ హై, పాగల్ హై అని నానా బూతులు తిడుతుంటారు. రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నా పేదవాడు తరతరాలుగా అవమానానికి గురవుతున్నాడు. సమాజంలో ట్రెండ్ నడుస్తుంది. ఖురాన్ మీద విశ్వాసం లేకపోవడమే మనిషి నిరాశకు ప్రధాన కారణం. లాయ్ లా ఇల్లాల్లా మహమ్మదుర్ రసూలుల్లా అని అరబ్బీలో మహమ్మద్ ప్రవక్త ప్రవచించారు. అల్లా తప్పితే మరో దేవుడు సృష్టిలో లేడని ప్రవక్త సందేశం ఇచ్చాడు. అల్లా మీద నమ్మకం లేనివారు ఇలా డిప్రెస్ అవుతారు. సంపద పెరిగితే తృప్తి పడరు. ఇం కా కావాలి కావాలి అంటారు.
నబీ ఎప్పుడు తప్పుడు ప్రవచనం ఇవ్వడు కదా. మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నాం.
ఎండాకాలంలో మా చిన్నప్పుడు చేతి విసనకర్రతో ఉక్కపోతతో ఉపశమనం పొందే వాళ్లం. పవర్ జనరేట్ అయ్యాక ఇళ్లలోకి కరెంట్ సప్లయ్ అయ్యింది. అప్పుడు ఫ్యాన్లతో సరిపెట్టుకున్నాం. జనాల దగ్గర డబ్బు ఎక్కువైతే విలాసవస్తువులపై మనసు పడుతుంది. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఎయిర్ కూలర్ల స్థానే ఎయిర్ కండిషన్ల ను కొనుగోలు చేస్తున్నారు. మన చెప్పులను స్థూల కాయులు ఒకసారి వేసుకుంటే ఆ చెప్పులు మళ్లీ మనకు వదులవుతాయి. మన తలకు సరిపడే హెల్మెట్ ను పెద్ద తల కాయ ఉన్న వ్యక్తి పెట్టుకుంటే ఆ హెల్మెట్ కూడా వదులవుతుంది. మనిషి కోర్కెలు పెరిగితే అవి తీరవు . అప్పుడు మనిషి డిప్రెషన్ కు లోనవుతాడు. డబ్బున్న వ్యక్తులను చూసి మనకూ లేదని మనలో విద్వేషం పెరుగుతుంది. నాకు అంత డబ్బు లేదు అని బాధపడొద్దు. కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తులకు అరుగుదల తగ్గిపోతుంది. అరుగుదల ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ధనికుడి కంటే పేదవాడు కంటినిండా నిద్రపోతాడు. డబ్బులెక్కువైన వ్యక్తి నిద్రమాత్రలు వేసుకుంటేనే కంటినిండా నిద్రపోతాడు.40 ఏళ్లు కష్టపడ్డా క్యారెక్టర్ లోపిస్తే అన్నీ పోయినట్టే. క్యారెక్టర్ పెంచుకునే యత్నం చేయాలి. అందం పోయినా పర్వాలేదు కాని మన వ్యక్తిత్వం పోకుండా జాగ్రత్తపడాలి. పైసా హాత్ కా మైలా హై. ఇల్మ్ నహీతో సబ్ కుచ్ చీన్ లేగా అల్లా
-బదనపల్లి శ్రీనివాసాచారి