ఎన్‌కౌంటర్... 40 మంది మావోయిస్టులు మృతి!
posted on Oct 5, 2024 7:00AM
చత్తీస్‌గఢ్ అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. నారాయణపూర్, దంతెవాడ సరిహద్దు నెందూర్, తులతులి అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసు బలగాలకు ఇంటెలిజెన్స్ సమాచారం అందిన నేపథ్యంలో ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మొత్తం 12 వందల మంది పోలీసు బలగాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సహజంగానే పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరపడం, పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపడం.. ఆ కాల్పుల్లో మావోయిస్టులు మాత్రమే మరణించడం.. ఇలాంటి కథనాలు చాలాసార్లు చదివే వుంటారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఎన్నికలలో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది.
తమ పార్టీ 20 ఏళ్ల వార్షికోత్సవాలను సెప్టెంబరు 21 నుంచి నెల రోజుల పాటు మావోయిస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో 20 ఏళ్లలో మావోయిస్టు పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లు, అవరోధాలను చర్చించాలన్నది మావోయిస్టుల అజెండా. ఈ సమావేశాల నేపథ్యంలోనే ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.