ముందు అది స్వర్గమో కాదో తేలితే...పవన్ కళ్యాణ్ రిప్లై
posted on Aug 20, 2015 4:53PM
.jpeg)
రాజధాని భూసేకరణ గురించి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలపై రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చాలా ఘాటుగా జవాబిచ్చారు. రాజధాని ప్రాంతంలో మధ్యలో ఉన్న భూములను తీసుకోకుండా గాలిలో రాజధానిని నిర్మించడానికి అదేమీ త్రిశంఖు స్వర్గం కాదని, తాము విశ్వామిత్రులంకామని జవాబిచ్చారు. దానిపై పవన్ కళ్యాణ్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఆయన ఈరోజు పోస్ట్ చేసిన ట్వీట్ మెసేజ్ చూస్తే అర్ధమవుతుంది.
“ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత అలోచించవచ్చు..సినిమా పరిశ్రమకి హైదరాబాద్ లో ఇచ్చినివి కొండలు..బహుళ పంటలు పండే పొలాలు కాదు ,ఇది రామకృష్ణుడు గారికి తెలియదనుకుంట. పైగా..హైదరాబాద్ కొండల్లో కానీ, విశాఖపట్నం కొండల్లో కానీ నాకైతే స్టూడియోలు లేవు. నేను ఎంతోబాధ్యతతో రైతుల సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే విజ్ఞతతో స్పందిచడం మానేసి రైతుల ఆవేదనని వెటకారం చెయ్యడం వారికే చెల్లింది. నేను త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నది పరివాహక గ్రామాల రైతులిని కలుస్తాను,” అని మెసేజ్ పెట్టారు.
మరి దీనికి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ తెదేపాకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడు ఈ సమస్య గురించి ఈవిధంగా నలుగురిలో చర్చించడం కంటే స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడితే అందరికీ గౌరవంగా ఉండేది.