రామ్ చరణ్ తేజ్ ఎలాగో పవన్ కళ్యాణ్ కూడా అలాగేనట!
posted on Aug 21, 2015 8:45AM
.jpg)
రేపు మెగాస్టార్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. తనకు తన కొడుకు రామ్ చరణ్ తేజ్ ఎలాగో తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అలాగేనని అన్నారు.వారిద్దరూ తనకి రెండు కళ్ళ వంటివారని అన్నారు. రాజకీయంగా తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దాని వలన తమ మధ్య అభిమానం, బంధుత్వంపై ఎటువంటి ప్రభావం చూపబోదని అన్నారు. కానీ తామిద్దరం ఒకే రాజకీయ వేదికపై పనిచేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. రాజకీయాలు తనకు చాలా ఖరీదయిన అనుభవమని తెలిపారు. రాజకీయాలలోకి వచ్చిన తరువాత తను చాలా పాఠాలు నేర్చుకొన్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తను కూడా ఒక సభ్యుడిని మాత్రమే కనుక తనకు నచ్చినట్లు పార్టీ నడవదని, పార్టీ సిద్దాంతాల ప్రకారమే తను నడుచుకొంటున్నాని అన్నారు.
పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయాలలో పనిచేసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేయడం ద్వారా ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలకు తెర దించినట్లయింది. కొడుకు రామ్ చరణ్ తేజ్ ఎలాగో తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అలాగేనని చెప్పడం చూస్తే బహుశః పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లుంది. కానీ అందరికీ ‘మనం’ సినిమా దొరకడం కష్టమని ఆయనే చెప్పారు. ఒకవేళ అటువంటి కధ దొరికితే మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఒకే సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లే భావించవచ్చును.
చాలా కుటుంబాలలో సభ్యుల మధ్య రాజకీయలపై భిన్నాభిప్రాయాలు కలిగిఉంటారు. కానీ వారందరూ సామాన్య ప్రజలు కనుక వారి అభిప్రాయలు వారివరకే పరిమితమవుతాయి. కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పెద్ద సినిమా హీరోలు కావడం, ఇద్దరూ పరస్పర విరుద్దమయిన రాజకీయ వేదికలను ఎంచుకోవడం వలన అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ తాము కూడా అందరిలాగే కలిసి మెలిసి ఉంటున్నామని, అవి తమ ప్రేమాభిమానాల మీద, బండుత్వాల మీద ఎటువంటి ప్రభావం చూపడం లేదని చిరంజీవి స్పశాతం చేసారు. ఎన్నికల సమయంలో చిరంజీవిని డ్డీ కొంటున్న సమయంలోనే తనకు అన్నయ్య తండ్రితో సమానమని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాలకి అతీతంగా మెగా బ్రదర్స్ అందరూ కలిసి ఉంటామంటే అభిమానులకీ, అందరికీ సంతోషమే కదా.