కొద్దిసేపట్లో కరోనా ఆయుర్వేద మందు విడుదల... కర్టెసీ రాందేవ్ బాబా

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా మందు, వ్యాక్సిన్ల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో రెండు అల్లోపతి మెడిసిన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు గ్లెన్మార్క్ , హెటేరో సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఐతే తాజాగా పతంజలి వ్యవస్థాపకులు, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తాము తయారు చేసిన కరోనా మందును ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్ లోకి విడుదల చేస్తారని పతంజలి సి ఇ ఓ ఆచార్య బాలకృష్ణ తన తాజా ట్వీట్ లో తెలిపారు.

పతంజలి తయారు చేసిన ఆయుర్వేద ఔషధం కరోనిల్ (Coronil) ను హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీట్ లో ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ ఆ ట్వీట్ లో తెలిపారు. ఈ సందర్భంగా మొట్ట మొదటి ఆయుర్వేద ఔషధం కరోనిల్ గురించి పూర్తి వివరాలను రాందేవ్ బాబాబు ప్రజలకు తెలియచేస్తారని అయన ప్రకటించారు.