తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై కు పితృవియోగం

 

తెలంగాణరాష్ట్ర మాజీ గవర్నర్ తమళిసై ఇంట్లో  విషాదం నెలకొంది. ఆమె తండ్రి కుమారి అనంతన్ బుధవారం తెల్లవారు జామున  చెన్నయ్ లో కన్నుమూశారు. వృద్దాప్య, అనారోగ్య కారణాల రీత్యా అనంతన్ చనిపోయారు.  ఆయన వయసు 93 సంవత్సరాలు.కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన అనంతన్ తమిళనాడు రాష్ట్రంలో చేసిన సేవలకు 2024లో రాష్ట్ర ప్రభుత్వం  తగైసల్ తమిజార్ పురస్కారంతో సత్కరించింది.   తమిళ సై తల్లి కృష్ణకుమారి 2021లో చనిపోగా ఈ రోజు తండ్రి చనిపోవడంతో ఆమె కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.