అసెంబ్లీ సమావేశాలకు కరోనా సోకిన ఎమ్మెల్యే .. టెన్షన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు 

విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన వైజాగ్ లోని ఒక గెస్ట్ హౌస్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను త్వరలో కోలుకుని మళ్ళీ మీడియా ముందుకు వస్తానని అయన ఎంతో కాన్ఫిడెన్స్ తో ప్రకటించారు.

వైసిపి ఎమ్మెల్యే శ్రీనివాసరావు అసెంబ్లీ సమావేశాల కు ముందు అమెరికా వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన అమెరికా నుండి ఏపీకి వచ్చినపుడు ఆయనలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ కనిపించలేదు. దీంతో రొటీన్‌గా విదేశాల నుండి వచ్చే వారికి చేసే పరీక్షలు ఆయనకూ చేసి ఎటువంటి సమస్య లేదని చెప్పారు. దీంతో స్వంత నియోజక వర్గానికి వచ్చి పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలను కలిశారు. ఐతే ఆయనకు కరోనా అమెరికాలోనే సోకిందా లేక... ఏపీకి వచ్చిన తరవాత సోకిందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మొన్న ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల లో పాల్గొన్నప్పుడు ఎమ్మెల్యేలందరితో కలిసిపోయి తిరిగారు. అంతే కాకుండా అసెంబ్లీలో జరిగిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఓటు వేశారు. దీంతో ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులకు టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యేకు కరోనా సోకినా ఎటువంటి లక్షణాలు బయట పడకపోవడంతో అయన ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉన్నందువల్ల అయన కాంటాక్ట్ లిస్ట్ ను అధికారులు ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే అయన కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటైన్ లో ఉంచి కరోనా టెస్ట్ చేశారు. టెస్ట్ రిజల్ట్ ఇంకా రావలసి ఉంది.