అల్ ఫలాహ్ వర్సిటీ ఆస్తుల జప్తునకు ఈడీ రెడీ!

హరియాణాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆస్తుల జప్తు దిశగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అడుగులు వేస్తున్నది. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు పేలుడు కేసులో  ఈ వర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధికీకి సంబంధాలున్నాయన్న అనుమానంతో ఆయనను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హర్యానా  ఫరీదాబాద్‌లోని  ఈ యూనివర్సిటీ భవనాలు అక్రమ మార్గాల్లో వచ్చిన నిధులతోనే నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అలాగే ఈ నిధులు మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా వచ్చినవని ఈడీ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు. దీంతో ఈ వర్సిటీపై చర్యలకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే అల్ ఫలాహ్ ట్రస్టుకు  అస్తుల మదింపులో ఈడీ ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఈ మదింపు పూర్తయిన వెంటనే యూనివర్సిటీ ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu