భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా దళాలు

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. సాంబా, రాజౌరీ, పూంచ్  జిల్లాల్లో ఆదివారం (జనవరి 11) పాక్ డ్రోన్ల కదలికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.  వెంటనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలలో అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్థాన్ డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశించి కొద్ది సేపు తరువాత తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.  

తొలుత రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని గనియా-కల్సియన్ గ్రామం వద్ద పాకిస్థాన్ డ్రోన్లు నింగిలో చక్కర్లు కొట్టడం గమనించినన భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి.  కాగా దాదాపు అదే సమ యంలో   ఖబ్బర్ గ్రామం వద్ద కూడా డ్రోన్ కదలికలను గుర్తించారు.  అలాగే సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్, పూంచ్ జిల్లా మాన్‌కోట్ సెక్టార్‌లలో కూడా పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయి.  ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను ఈ డ్రోన్ల ద్వారా భారత భూభాగంలోకి జారవిడిచారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీంతో ఆర్మీ, పోలీసులు ఆయా ప్రాంతాలలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.  ఇటీవలే సాంబా జిల్లా పాలూరా గ్రామం వద్ద డ్రోన్ ద్వారా పంపిన ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ల తాజా  కదలికలను సీరియస్ గా తీసుకున్న భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. భారత గణతంత్ర దినోత్సవం సమీపిత్తున్న ఈ సమయంలో  భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ల సంచారం కలవరం రేపుతోంది. భద్రతా దళాలు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu