తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ
posted on Jan 10, 2026 7:59PM

జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బరిలో దిగాలని ఆ పార్టీ డిసైడ్ అయింది. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేయున్నట్లు తెలిపారు. ప్రతి జనసైనికుడు, వీర మహిళ ఉత్సాహంగా ప్రచారానికి సిద్ధం కావాలని ప్రకటించింది.
పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి చేరవేయడం ద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేధికకు పునాధి వేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించింది. త్వరలోనే పార్టీ కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొంది. ఈ ఎన్నికల ప్రచారంలో జనసైనికులు చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని జనసేన పార్టీ పిలుపు నిచ్చింది.