డిల్లీలో 9మంది ఉగ్రవాదులు?

 

డిల్లీలో ఏకంగా 9మంది ఉగ్రవాదులు ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుల సమయంలో లేదా అంతకంటే ముందే డిల్లీలో ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేసాయి. వెంటనే కేంద్రం డిల్లీతో సహా దేశమంతా హై అలెర్ట్ ప్రకటించింది. కనుక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో ప్రజలు, పోలీసులు అందరూ అప్రమత్తంగా మెలగడం మంచిది.

 

వారం రోజుల క్రితం పంజాబ్ గురుదాస్ పూర్ లో పోలీస్ స్టేషన్ పై పాక్ ఉగ్రవాదులు ముగ్గురు దాడి చేసి 8మందిని చంపారు. మళ్ళీ మొన్న ఇద్దరు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉదంపూర్ జిల్లాలో భారత సరిహద్దు భద్రతా దళాల మీద దాడి చేసి ఇద్దరు జవాన్లను చంపారు. వారిలో ఒక ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ నిన్న సజీవంగా పట్టుబడ్డాడు. హిందువులను చంపడానికే తాను పాకిస్తాన్ నుండి వచ్చానని అలాగా చంపడం తనకు చాలా వినోదం కలిగిస్తుందని నవ్వుతూ చెప్పాడు. మనుషుల ప్రాణాలను తీయడం వినోదంగా భావించే అటువంటి ఉగ్రవాదులు 9మంది డిల్లీలో ప్రవేశించారంటే ఎంత ప్రమాదమో అర్ధమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu