ఇండియాకి మరిన్ని ప్రకృతి విపత్తులు...
posted on Sep 12, 2014 5:20PM
భారతదేశాన్ని ముందు ముందు మరెన్నో ప్రకృతి విపత్తులు ముంచెత్తే అవకాశం వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సంభవించిన కాశ్మీర్ వరదలు ఈ దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన వరదలని, ముందు ముందు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు దేశంలో మరిన్ని సంభవించే అవకాశాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎన్ఇ) పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా వుండటం మంచిదని సూచిస్తున్నారు. సీఎస్ఇ నివేదిక ప్రకారం భారత దేశంలో అధిక వర్షపాతం వల్లే ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. అందువల్ల ప్రతి ఏడాదీ వర్షాకాలం వచ్చే ముందుగానే అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించవచ్చు.