హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూలు విడుదల

 

హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఈ రెండు శాసనసభలకు అక్టోబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 19న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 27 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు అక్టోబర్ 1వ తేదీ. హర్యానాలో 90, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సీట్లున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది.