తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా

 

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం బుధవారం (జనవరి 29) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల అంటే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదలౌతుంది. అదే నెల 27న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. 

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రెండు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు కాగా, ఒకటి పట్టభద్రుల స్థానం. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి.  

ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 3న ప్రారంభం అవుతుంది. నామినేషన్ల దాఖలుకు తుదిగడువ ఫిబ్రవరి 10 కాగా, నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11న జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 13. పోలింగ్ ఫిబ్రవరి 27న జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడిస్తారు.