పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఇన్ స్పెక్టర్ దురుసు ప్రవర్తన 

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావు సందడి చేశారు. సాధారణంగా డిప్యూటి సిఎం కార్యాలయంలోకి వెళ్లాలంటే సెక్యురిటీ సిబ్బంది ప్రొటోకాల్ పాటించాలి.  ముందుగా అపాయిట్మెంట్ తీసుకోకుండా, భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నా ఆగకుండా నేరుగా లోపలికి వెళ్లారు. ఓవైపు పవన్ కల్యాణ్ వారాహి పూజ చేస్తుండగా బూట్లతోనే లోపలికి వెళ్లారు. భధ్రతా సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. సదరు సీఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

త్రిపురాంతకం సీఐ వినోద్‌కుమార్‌ను మంగళగిరి టౌన్ సీఐగా నియమిస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. కాగా, సీఐ శ్రీనివాసరావు గతంలోనూ ఇలాగే దురుసుగా వ్యవహరించారని, జనసేన ఆఫీసులో పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్ లో తనిఖీల పేరుతో హడావుడి చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.