మనీష్ సిసోడియా కస్టడీ పొడగింపు 

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా కుదిపేసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కెసీఆర్ తనయ ఈ స్కాంలో కింగ్ పిన్. ఈ కేసులో ఇరుక్కున్న వారు తప్పించుకునే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. 
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్య మంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో శనివారం అధికారులు ఆయనను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయన కస్టడీని మరోమారు పొడిగించింది. ఈ నెల 15 వరకు కస్టడీని పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు.. విచారణను అదేరోజుకు వాయిదా వేసింది. ఈమేరకు శనివారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియాను గతేడాది మార్చిలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై చేసిన అప్పీల్, ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వాదనలను వాయిదా వేసింది. ఈ నెల 15న మళ్లీ విచారణ జరుపుతామని పేర్కొంది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై  ఈ నెల 8న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మద్యం పాలసీ కేసుపై కోర్టు ఈరోజు విచారణ జరిపింది. దర్యాఫ్తులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో జూన్ 7న కవితపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.  మద్యం పాలసీ రూపకల్పన కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సీబీఐ పేర్కొంది.