లగడపాటి వ్యాఖ్యలపై కొనసాగుతున్న రగడ

నిజామాబాద్ : విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ వ్యాఖ్యలపై రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయనకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. లగడపాటికి దమ్ము ఉంటే బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ చేశారు.