తెలంగాణలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
posted on Apr 7, 2025 3:31PM

తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికైన ఎణిమిది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు సోమవారం (ఏప్రిల్ 7) ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికైన ఎనిమిది మందిలో ఏడుగురి చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం (ఏప్రిల్ 7) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇక ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలు, అలాగే ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంగెలిచిన పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. దాసోజు శ్రవణ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నతి తెలియరాలేదు.