అబుదాబిలో అంబరాన్నంటిన శ్రీరామనవమి వేడుకలు

అబుదాబీలోని బాప్స్ స్వామినారాయణ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.   అబుదాబీలోని బాప్స్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. యూఏఈ వ్యాప్తంగా ఉన్న భక్తులు వందలాదిగా కార్యక్రమానికి తరలివచ్చారని వారు తెలిపారు. రామ భజనలతో శ్రీరామనవమి ఘనంగా జరుపుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు,

హైందవ విలువలకు, శాంతి-ఐక్యతకు ప్రతీకగా నిలిచే శ్రీరామనవమి వేడుకలకు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లోని పలు నగరాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రామ భజనలతో  అబుదాబి మార్మోగిపోయింది. అంతటా ఆధ్యాత్మికత వెల్లి విరిసింది.  దేశ విదేశాల్లో భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు శ్రారామనవమి వేడుకలు దోహదం చేస్తాయన్న నిర్వాహకులు భవిష్యత్ లో మరింత ఘనంగా, భక్తి, నిష్టలతో శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు.