పవన్ కళ్యాణ్ ఓకే గాని చిరంజీవి తట్టుకోలేడు..బాబాయ్ ఓడిపోయినట్టే  

కోన వెంకట్(kona venkat)కమర్షియల్ సినిమాలకి కామెడీ టచ్ ని అందించి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించడంలో మంచి నేర్పరి. ఆయన సృష్టించిన పాత్రలు, రాసిన చాలా డైలాగ్స్ నేటికీ ప్రేక్షకుల  ముఖాల్లో నవ్వులు పూయిస్తూనే ఉన్నాయి. వెంకీ,ఢీ,రెడీ, దూకుడు, కింగ్, బాద్ షా, పండగ చేసుకో, బలుపు లాంటి హిట్ చిత్రాలే అందుకు ఉదాహరణ. నిర్మాతగాను సక్సెస్ ఫుల్  సినిమాలు నిర్మిస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసాడు

నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ (pawan kalyan)ఉపముఖ్యమంత్రితో పాటు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఈ రోజు  బాధ్యతలని చేపట్టాడు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళు అయితే తమ మనిషి ఉన్నత స్థాయికి వెళ్లినందుకు ఉబ్బి తబ్బిబ్బి అవుతున్నారు. ఈ క్రమంలో కోన వెంకట్  సోషల్ మీడియా ద్వారా పవన్ కి  ధన్యవాదాలు తెలుపుతూ తన దైన స్టయిల్లో వ్యాఖ్యలు చేసాడు. పవన్ కి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇది ఆయన కల కాదు. లక్షలాది మంది అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు,కుటుంబ సభ్యులు, సామాన్యుల కల. ఈ స్థానికి చేరుకోవడానికి  పదిహేను సంవత్సరాలు   కష్టపడ్డాడు అని ప్రశంసలు కురిపించాడు.

ఇక చిరంజీవి(chiranjeevi)ని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేసాడు. ఇక పవన్ విజయాన్ని చూసి గర్విస్తున్న  పద్మవిభూషణ్ చిరంజీవికి  ప్రత్యేకంగా అభినందలు కూడా  తెలిపాడు. ఇక గతంలోని  ఒక ఇంటర్వ్యూ లో పవన్ కి రాజకీయాలు సూటవ్వవు అని కోన వెంకట్  చెప్పాడు. అందుకు గల కారణాన్ని కూడా తెలిపాడు. పవన్ చిరంజీవి లు చాలా సున్నిత మనస్కులని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేరని, చిరంజీవి అయితే  మాత్రం  ఎక్కడో దూరాన ఉన్న మనిషి నా  గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని చిరు కి  తెలిస్తే హార్ట్ అయిపోతాడని చెప్పాడు. ఇక పవన్ మాత్రం నేను సున్నిత మనస్కుడినని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పాడనే విషయాన్ని వెల్లడి చేసాడు. కోన వెంకట్ బాబీ కోన రఘుపతి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో  బాపట్ల నుంచి వై సిపీ తరుపున ఎంఎల్ ఏ గా పోటీ చేసి ఓడిపోయాడు.