రేవంత్ రెడ్డికి కెసీఆర్ మాస్ వార్నింగ్ 

ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు. బిఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన పని లేదు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కెసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో ఆయన పాలకుర్తి  నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. చాలా రోజుల తర్వాత కెసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.  ఈ సమావేశంలోనే కెసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంలో దర్యాప్తు తుది దశకు వచ్చిన  నేపథ్యంలో కెసీఆర్ అరెస్ట్ ఖాయం అని ప్రచారం జరుగుతుంది. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కొడుకు కెటీఆర్ అరెస్ట్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తన గారాల పట్టి కవిత ఇటీవల బెయిల్ పై విడుదలైనప్పటికీ కెటీఆర్ అరెస్ట్ వార్తలు కెసీఆర్ కి  తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఈ కారణంగానే ఫ్రస్టేషన్ లో రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి 11 నెలలు అయ్యింది.  అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పింది.  ఈ పిచ్చి మాటలు మాకు రావా? ఈ రోజు మాట్లాడటం ప్రారంభిస్తే రేపటివరకు ఆగకుండా మాట్లాడగలం.  ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం భయపెడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.